దర్శి: జస్టిస్ గవాయ్ పై దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేయాలని ఎమ్మార్పీఎస్ నాయకులు నిరసన
Darsi, Prakasam | Oct 17, 2025 ప్రకాశం జిల్లా దర్శి పట్టణంలోని ఎమ్మార్వో కార్యాలయం నందు ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో జస్టిస్ గవాయ్ పై దాడి జరిగి 10 రోజులు అవుతున్న సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోలేదని నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ నియోజకవర్గ నాయకులు ఏలేశ్వరావు మాట్లాడుతూ దళితులపై దాడులు ఎక్కువగా జరుగుతున్నాయి అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. జస్టిస్ గవాయిపై దాడికి పాల్పడిన వారిని వెంటనే చట్ట ప్రకారం అరెస్ట్ చేసి శిక్షించాలని కోరారు.