కరీంనగర్: లోయర్ మానేర్ జలాశయాన్ని పరిశీలించిన రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్..ఇన్ ఫ్లో,అవుట్ ఫ్లో వివరాలు అడిగి తెలుసుకున్న మంత్రి
లోయర్ మానేరు డ్యామ్ ను సోమవారం సాయంత్రం 6గంటలకు పరిశీలించిన రాష్ట్ర బిసి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రస్తుతం వస్తున్న ఇన్ ఫ్లో.. బయటకు వదిలినటువంటి అవుట్ ఫ్లో నీటి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఈసారి రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవడంతో గోదావరి ,కృష్ణ బేసిన్ లో అన్ని ప్రాజెక్ట్ లు నిండు కుండాల ఉన్నాయనీ తెలిపారు మంత్రి పొన్నం ప్రభాకర్. ప్రాజెక్టు లు, చెరువులు జలకళ సంతరించుకోవడంతో అటు వ్యవసాయం, మత్స్య పరిశ్రమ మరింత వృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్.