గజపతినగరం: యూరియా పంపిణీలో స్థానికమంత్రి విఫలం: గజపతినగరంలో మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పల నరసయ్య
స్థానిక మంత్రి కొండపల్లి శ్రీనివాస్ రైతులకు యూరియా పంపిణీ చేయడంలో విఫలమయ్యారని, మంగళవారం మధ్యాహ్నం వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పల నరసయ్య ఆరోపించారు. స్థానిక టిడిపి నాయకులు యూరియాను పక్కదోవ పట్టిస్తున్నారన్నారు. సమావేశంలో జడ్పిటిసి గార తౌడు, వైసీపీ మండల అధ్యక్షుడు బి వెంకటరావు, వైసీపీ నాయకులు బెల్లాన త్రినాధ రావు, మండల సురేష్, కరణం ఆదినారాయణ, వేమలి ముత్యాల నాయుడు తదితరులు పాల్గొన్నారు.