ప్రకాశం జిల్లాలో కందుకూరు సబ్ డివిజన్ ను కలపటం ప్రక్రియలో భాగంగా ఉలవపాడు పోలీస్ స్టేషన్ స్థితిగతులు, సిబ్బంది పని తీరును, కేసుల నమోదు, ప్రజలకు అందుతున్న సేవలు, శాంతి భద్రతలను క్షేత్ర స్థాయిలో పరిశీలించడానికి ఉలవపాడు పోలీస్ స్టేషన్ మంగళవారం జిల్లా ఎస్పీ సందర్శించి పోలీస్ స్టేషన్ ఆవరణాన్ని,గదులను, రిసెప్షన్ కౌంటర్, స్టేషన్ పరిసరాలను పరిశీలించారు. పట్టుబడిన వాహనాలు మరియు తదితర రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.పోలీస్ స్టేషన్ పరిధిలో లా అండ్ ఆర్డర్, నేర నివారణ వ్యూహాలపై తీసుకుంటున్న చర్యలపై అధికారులను ఆరా తీసి పలు సూచనలు చేసారు.