బస్సు ప్రమాదాలను రోడ్డు రవాణా సంస్థ సీరియస్ గా తీసుకోవాలి: బిజెపి నేత నవీన్
కర్నూలు వద్ద బైక్ ను ఢీకొని బస్సు అగ్ని ప్రమాదానికి గురి కావడం సుమారు 20 మంది అభం శుభం తెలియని ప్రయాణికులు ప్రాణాలు కోల్పోవడం హృదయ విధారకమని బిజెపి నేత నవీన్ కుమార్ రెడ్డి అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కొంత మంది ఆర్టీవో బ్రేక్ ఇన్స్పెక్టర్ల నిర్లక్ష్యం ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రయాణికుల పాలిట శాపంగా మారిందన్నారు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను రోడ్డు రవాణా సంస్థ అధికారులు నిరంతరం తనిఖీలు చేయకపోవడంతో తరచూ ప్రమాదాలు జరిగి ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.