పారిశుద్ధ్య కార్మికుల సేవలు మరవలేనివి : జగ్గంపేటలో ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ
పారిశుద్ధ్య కార్మికుల సేవలు మరవలేనివని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు.స్వచ్ఛతాహి సేవా కార్యక్రమంలో భాగంగా శనివారం రాజమండ్రి రోడ్ లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఆవరణలో జగ్గంపేట మండలంలో 102 మంది పారిశుధ్య కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఘన సన్మానం చేసి మెడికల్ కిట్లు పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జగ్గంపేట మండలం ఎంపీడీవో చంద్రశేఖర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ స్వచ్ఛతాహి సేవా కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పారిశుధ్య కార్మికులకు మనోధర్యం కల్పించేలా వారికి అన్ని రకాల వైద్య పరీక్షలు చేయించి వారిని ఘనంగా సత్కరించారు.