ములుగు: జిల్లా కేంద్రంలో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ఆవిష్కరించిన మంత్రి సీతక్క
Mulug, Mulugu | Sep 17, 2025 ములుగు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జాతీయ జెండా ను మంత్రి సీతక్క నేడు బుధవారం రోజున ఉదయం 9 గంటలకు ఆవిష్కరించారు. ముందుగా అమరవీరులకు నివాళులు అర్పించి, పోలీసు వారి గౌరవ వందనం స్వీకరించి, అనంతరం జిల్లా ప్రగతి నివేదికను చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, ఎస్పీ శబరిష్ ఐపిఎస్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.