వికారాబాద్: మిట్ట కోడూరు వెళ్లే రహదారి బురదమయం, ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాహనదారులు
బురద మయంగా రోడ్డు ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాహనదారులు వికారాబాద్ జిల్లా పరిగి మండల పరిధిలోని తుంకలుగడ్డ నుండి మిట్ట కోడూరు వెళ్లే రహదారి బురదమయంగా కావడంతో నిత్యం పరిగి పట్టణానికి వచ్చే వాహనదారులు, బాటసారిలో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని పలువురు వాహనదారులు వాపోతున్నారు. వర్షం కురిస్తే రోడ్డు పరిస్థితి మరి దారుణంగా తయారవుతుందని సంబంధిత అధికారులు స్పందించి రోడ్డు మరమ్మతులు చేయాలని వాహనదారులు మంగళవారం తెలిపారు.