ఒంగోలులోని పలు హోటల్స్ మరియు లాడ్జిలను ఆకస్మిక తనిఖీ చేసిన పోలీసులు
Ongole Urban, Prakasam | Oct 23, 2025
శాంతి భద్రతల పరిరక్షణ, నేర నియంత్రణ, చట్ట విరుద్ధ కార్యకలాపాలను అరికట్టడమే లక్ష్యంగా జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాలతో ఒంగోలు నగరంలోని స్ధానిక పోలీసు సిబ్బందితోపాటు స్పెషల్ పార్టీ సిబ్బందితో గురువారం హోటల్స్, లాడ్జిలు తనిఖీలు నిర్వహించారు. ఒంగోలులోని లాడ్జిలను, హోటల్స్ రూమ్స్ ను పోలీసులు ప్రతీ గదిని క్షుణ్ణంగా తనిఖీ చేసి, లాడ్జిలలో బస చేసిన వ్యక్తల వివారాలను పరిశీలించి, కొత్త వ్యక్తులను ప్రశ్నిస్తూ వివరాలపై ఆరా తీశారు. లాడ్జిలలోని కంప్యూటర్ లో ఇతర ప్రాంతాల నుండి వస్తున్న వారి వివరాలు ఎప్పటికప్పుడు నమోదు చేయాలని సూచించారు.