గుడివాడ లో కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈనెల 9న దేశవ్యాప్తంగా జరిగే సభను జయప్రదం చేయాలని గుడివాడలో సీఐటీయూ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీని నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన 4 లేబర్ కోడ్లను రద్దు చేసి, కార్మికులకు కనీసం వేతనం రూ.26 వేలు ఇవ్వాలని ఆర్ సీపీ రెడ్డి డిమాండ్ చేశారు. రైతుకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా చట్టాలు చేయాలని, వ్యవసాయ కార్మికులకు రూ.600 కూలీ ఇవ్వాలని కోరారు.