రాజంపేట జిల్లా కేంద్రం చేసే వరకు ఉద్యమం ఆగదని ప్రజల ఆకాంక్ష మేరకు ఉద్యమాలు చేస్తామని రాజంపేట మున్సిపల్ వైస్ చైర్మన్ మరి రవికుమార్ హెచ్చరించారు. రాజంపేటలో రిలే నిరాహార దీక్షలు సోమవారం మూడో రోజుకు చేరుకున్నాయి. ఆయన మాట్లాడుతూ బ్రహ్మంగారి సాక్షిగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాటను నిలుబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై ఆలోచించాలని సూచించారు.