నంద్యాల జిల్లా పాణ్యం గ్రామ సమీపంలోని NH-40 సర్వీస్ రోడ్డుపై గురువారం కారు బోల్తా పడింది. వేగంగా వస్తున్న కారు సర్వీస్ రోడ్డు దాటే క్రమంలో ఫుట్ పాత్ పైకి దూసుకెళ్లి బోల్తా పడింది. కాగా అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వ్యక్తులు క్షేమంగా ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. హైవే పోలీస్ పెట్రోలింగ్ సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని వారిని రక్షించారు.