రాయదుర్గం: గోనబావి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వృద్ధురాలు
గుమ్మగట్ట మండలం గోనబావి గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు తీవ్రంగా గాయపడ్డారు. గోనబావికి చెందిన కురుబ తిప్పక్క సోమవారం సాయంత్రం కూలికి వెళ్లి తిరిగి నడుచుకుంటూ రోడ్డు దాటుతుండగా ఎరడికెర నుంచి బైక్ పై వేగంగా వచ్చిన నాగరాజు ఆ వృద్ధురాలిని డీకొన్నాడు. ప్రమాదంలో ఆమె కాలు నుజ్జు నుజ్జయింది. నాగరాజు స్వల్పంగా గాయపడ్డాడు. 108 కు ఫోన్ చేసినా రాకపోవడంతో ప్రైవేటు వాహనంలో రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో అనంతపురానికి రెఫర్ చేశారు.