యర్రగొండపాలెం: నవంబర్ 13వ తేదీ టీడీపీ పుల్లలచెరువు మండల కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం
ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం టిడిపి కార్యాలయంలో నవంబర్ 13వ తేదీ గురువారం ఉదయం 10 గంటలకు పుల్లలచెరువు మండల గ్రామ క్లస్టర్ యూనిట్ బూత్ నూతన కమిటీల ప్రమాణ స్వీకారం జరుగుతుందని మండల అధ్యక్షులు గోవిందు తెలిపారు. టిడిపి ఇన్చార్జి ఎరిషన్ బాబు అధ్యక్షతన నిర్వహించే ఈ కార్యక్రమంలో మండలంలోని కూటమి నాయకులు కార్యకర్తలు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.