కడప జిల్లా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్ల పల్లె సమీపంలోని ప్రముఖ పురాతన పుణ్యక్షేత్రం కన్య తీర్థంలో నేడు కార్తీక మాసం మూడో సోమవారం సందర్బంగా భక్తులు పోటెత్తారు. సోమవారం పురస్కరించుకుని శ్రీ బాలత్రిపుర సుందరి దేవి, సుందరేశ్వర స్వామి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. ఈ కన్య తీర్థాన్ని క్రీస్తుపూర్వం ఆచార్య నాగార్జునుడు,మౌర్య చంద్రగుప్తుడు, అశోక చక్రవర్తి దర్శించుకుని అమ్మవారి ఆశీర్వాదాలు పొందినట్లు స్థల పురాణం చెబుతోంది. జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, కడప తదితర ప్రాంతాల నుంచి భక్తులు,మహిళలు తరలివచ్చారు. ఈ సందర్బంగా ఆలయం ముందు మహిళలు కార్తీక దీపాలను వెలిగించారు