ఉంగుటూరులో మూడుకోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ శంకుస్థాపనలు
Eluru Urban, Eluru | Sep 28, 2025
ఉంగుటూరు నియోజకవర్గంలో మూడుకోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్, స్థానిక ఎమ్మెల్యే ధర్మరాజుతో కలిసి ఆదివారం శంకుస్థాపనలు చేశారు. స్థానిక ఉంగుటూరు ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు, ఏపీ ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, ఉమ్మడి జిల్లా జడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ హాజరయ్యారు. భీమడోలు మండలం గుండుగొలను బీసీ కాలనీలో ఉపాధిహామీ నిధులు 70లక్షలతో నిర్మించనున్న సీసి రోడ్లు నిర్మాణానికి అదేవిధంగా స్థానిక హౌసింగ్ కాలనీలో 45లక్షలతో నిర్మించనున్న మెటల్ రోడ్డు పనులకు, కైకరం 95లక్షలతో సీసీ రోడ్డు, డ్రైనేజికి శంకుస్థాపన చేసారు.