మార్కాపురం: ఎన్టీఆర్ భరోసా పింఛన్ అందజేసిన ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి
ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని గొర్లగడ్డ వీధిలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి పాల్గొన్నారు. ఎమ్మెల్యే స్వయంగా లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి పింఛన్లు అందజేశారు దేశ చరిత్రలో ఎక్కడలేని విధంగా మన రాష్ట్రంలో ఒకటో తేదీ పింఛన్ అందజేస్తున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కి దక్కుతుందన్నారు. లబ్ధిదారులు ఇబ్బంది పడకుండా ఒకటవ తేదీ ఉదయం 90% పంపిణీ జరిగినట్లు తెలిపారు.