తాడిపత్రి: తాడిపత్రిలో పర్యటించిన జిల్లా కలెక్టర్ ఆనంద్, నియోజకవర్గంలోని అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించిన ఎమ్మెల్యే జేసీ అస్మిత్
తాడిపత్రిలో కలెక్టర్ ఆనంద్ పర్యటించారు. ఆర్ అండ్ బీ బంగ్లాలో తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి కలెక్టర్ ఆనంద్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలపై సుదీర్ఘంగా చర్చించారు. నేషనల్ హైవే 544 - D కి సంబంధించి ముచ్చుకోట, ఎర్రగుంటపల్లి, బుగ్గ, పులిపొద్దుటూరు గ్రామాలలో ల్యాండ్ ఆక్వేషన్కి స్పెషల్ అధికారిని నియమించి తొందరగా సమస్యలు తీర్చాలన్నారు.