నిజామాబాద్ రూరల్: డిచ్పల్లి లో దొంగతనానికి పాల్పడ్డ నిందితుడు అరెస్ట్, నగదు, నగలు స్వాధీనం
డిచ్పల్లి మండలంలోని ధర్మారం (బి) గ్రామంలో తాళం వేసిన ఇంట్లో చోరికి పాల్పడ్డా నిందితుడిని అరెస్టు చేసినట్లు డిచ్పల్లి సీఐ వినోద్ తెలిపారు. శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గ్రామానికి చెందిన రజిత గత నెల 30న రాత్రి ఇంటికి తాళం వేసి వెళ్ళింది. ఇదే ఆధునిక భావించిన అదే గ్రామానికి చెందిన రాజు (26) ఇంట్లో చొరబడి నగదు 30 గ్రాముల బంగారం, 100 గ్రాముల పట్టా గొలుసులు,15 వేల నగదును దోచుకెళ్లి పరారయ్యాడు. బాధితురాలు ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టి ఈరోజు నిందితున్ని అరెస్టు చేసి, నగదు నగదు రికవరీ చేశారు.