శామీర్పేట: మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ ఆర్ కళాశాలలో విద్యార్థిపై ర్యాగింగ్ ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు
యాదాద్రి భువనగిరి జిల్లా: మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఆర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న గంగాధరీ గణేష్ (17), అనే విద్యార్థి పై ముగ్గురు తోటి విద్యార్థులు హాస్టల్లో ర్యాగింగ్ చేస్తూ దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది బాధితుడుని ఆసుపత్రిలో చేర్పించి వైద్యం అందించారు. కళాశాల ప్రిన్సిపల్ స్పందించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆదివారం విద్యార్థులపై చర్యలు తీసుకోవాలని ఎస్ఆర్ కళాశాలమందు బంధువులు ఆందోళన చేపట్టారు.