జగిత్యాల: జిల్లా కలెక్టరేట్లో ప్రజా పాలన దినోత్సవం, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్
సెప్టెంబర్ 17న తెలంగాణ రాష్ట్ర విమోచన దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన దినోత్సవం జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంలో జగిత్యాల జిల్లా కేంద్రంలో సమీకృత కలెక్టరేట్ ఆవరణలో బుధవారం తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ జాతీయ జెండాను ఎగరవేశారు. జిల్లా కలెక్టరేట్ కు ఉదయం 9 గంటల 55 నిమిషాలకు చేరిన నిరంజన్ కు జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్, అదనపు కలెక్టర్లు బి ఎస్ లత, బి. రాజాగౌడ్ లు పుష్పగుచ్చం అందించి స్వాగతం పలికారు. ముందుగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించి,జాతీయ పతాకావిష్కరణ గావించారు.అనంతరం.....