వర్ని: చేయూత పింఛన్లు పెంచాలని రుద్రుడు జిపి ఎదుట విహెచ్పిఎస్ నాయకుల ధర్నా
చేయూత పింఛన్లు పెంచాలని డిమాండ్ చేస్తూ వికలాంగుల హక్కుల పోరాట సమితిజాతీయ అధ్యక్షురాలు సుజాత సూర్య వంశీ ఆధ్వర్యంలో సోమవారం 12 గంటలకు దివ్యాంగులు రుద్రూర్ గ్రామంలోని గ్రామపంచాయతీ కార్యాలయాన్ని ముట్టడించారు. సీఎం డౌన్ డౌన్.. పీఎం డౌన్ డౌన్.. అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్బంగా సుజాత సూర్య వంశీ మాట్లాడుతూ.. దివ్యాంగుల పింఛన్లు పెంచకపోతే రాజీనామా చేయాలని ఆమె డిమాండ్ చేశారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని గ్రామపంచాయతీ కార్యదర్శి ప్రేమదాస్ కు అందజేశారు.