పట్టణంలో నిబంధనలు అతిక్రమించిన రెండు బస్సుల పై కేసు నమోదు చేసిన RTO దామోదర నాయుడు
శ్రీకాళహస్తిలో 2 బస్సులపై కేసు నమోదు శ్రీకాళహస్తిలో ప్రైవేట్ పాఠశాలల బస్సులను ఆర్టీవో దామోదర్ నాయుడు, వన్ టౌన్ సీఐ ప్రకాష్ రావు బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. బస్సుల్లో అత్యవసర ద్వారం, మంటలను ఆర్పే పరికరాలు, డ్రైవర్‌కు లైసెన్స్ ఉందా? లేదా? అని ఆరా తీశారు. విద్యార్థులను పరిమితికి మించి తీసుకెళ్లే విషయంపైనా తనిఖీలు చేశారు. నిబంధనలు అతిక్రమించిన రెండు బస్సులపై కేసు నమోదు చేసినట్లు అధికారులు వెల్లడించారు.