మేడిపల్లి: మండల కేంద్రంలోని ఎస్సారెస్పీ కెనాల్ వద్ద ప్రమాదవశాత్తు చెట్లపొదల పడి వేములవాడ భీమయ్య(65) అనే వ్యక్తి మృతి
మేడిపల్లి మండల కేంద్రానికి చెందిన వేములవాడ భీమయ్య(65) అనే వ్యక్తి గ్రామ శివారులోని srsp కాలువ వద్ద బుధవారం సాయంత్రం వ్యవసాయ పొలం వద్ద కరెంట్ మోటర్ లో నీళ్లు లేకపోవటంతో పక్కనే ఉన్న కాలువ నుండి నీటిని బకెట్‌తో మోటర్ పైపు వేయడానికి నీటిని తాడు కట్టి బిందతో తోడుతుండగా ప్రమాదవశాత్తూ చెట్లపొదల్లో పడ్డాడు దీంతో శరీర ఇతర భాగాలకు గాయాలయ్యాయి, దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు మృతునికి ఇద్దరు కొడుకులు కాగా ఇద్దరు కొడుకులు ఉపాధి నిమిత్తం గల్ఫ్ దేశంలో ఉన్నారు. మృతుడి భార్య వేములవాడ రాజనర్స ఫిర్యాదు మేరకు స్టేషన్ హౌస్ ఆఫీసర్ ఎండి ఇలియాస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు