గోపాలపురంలో సీఫుడ్ ఫ్యాక్టరీలో అమ్మోనియం గ్యాస్ లీక్ ఘటనలో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
రావులపాలెం మండలం గోపాలపురం అవంతి సీఫుడ్ ఫ్యాక్టరీలో అమోనియం గ్యాస్ లీకై ఒక వ్యక్తి మృతి చెందాడు. అవంతి ప్రోజిన్ ఫుడ్స్ కంపెనీలో ఈనెల 10వ తేదీ ఉదయం అమోనియా గ్యాస్ లీకైంది. ఈ ఘటనలో గోపాలపురం గ్రామానికి చెందిన మైగాపుల కొండేశ్వరరావు (47) అనే మిషన్ ఆపరేటర్ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే అతనిని అమలాపురంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు రావులపాలెం ఎస్సై చంటి తెలిపారు.