గద్వాల్: గుర్రం గడ్డ గ్రామ మా బడికి సారు కావాలని ధర్నా చేస్తున్న విద్యార్థులు
గద్వాల మండలం గుర్రంగడ్డ ప్రాథమిక పాఠశాల టీచర్ ఇటీవల మల్దకల్ మండలానికి బదిలీ కావడంతో టీచర్ లేక 20 రోజులుగా ఇబ్బంది పడుతున్నామని విద్యార్థులు పేర్కొన్నారు. సోమవారం మధ్యాహ్నం గుర్రం గడ్డ గ్రామం నుంచి బోటుపై విద్యార్థులు, తల్లిదండ్రులు గద్వాలకు చేరుకొని కలెక్టర్ సంతోష్‌ను కలిసి విషయాన్ని వివరించారు. రెండు రోజుల్లో టీచర్‌ను నియమిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు.