బాలాయపల్లి సెక్షన్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ సుహాసిని వారి సిబ్బందితో పది ఎర్రచందనం దుంగలు స్వాధీనం
Gudur, Tirupati | Oct 25, 2025 తిరుపతి జిల్లా బాలాయపల్లి (మం) సెక్షన్ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ సుహాసిని వారి సెక్షన్ సిబ్బందితో కలిసి పది ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్న సంఘటన.. అలిమిలి రిజర్వు ఫారెస్ట్ లో పెట్రోలింగ్ చేయుచుండగా ముళ్లపోదలో పది ఎర్రచందనం దొంగలు గుర్తించారు. వెంకటగిరి ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ డివి రమణయ్య కు తెలియపరచి వారి ఆదేశాల మేరకు అశోక్, భవాని, గిరి, బేస్ క్యాంపు సిబ్బందితో కలసి దుంగలను రేంజ్ కార్యాలయానికి తరలించడం జరిగినట్టు సమాచారం