కొండపి: సింగరాయకొండ మండలంలో ఉపాధ్యాయుడిపై నమోదైన ఫోక్సో కేసు పై అధికారులతో చర్చించిన జిల్లా విద్యాశాఖ అధికారి కిరణ్ కుమార్
ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలంలో ఓ ఉపాధ్యాయుడు బాలికను వేధింపులకు గురి చేశాడని తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఫోక్సొ కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై జిల్లా విద్యాశాఖ అధికారి కిరణ్ కుమార్ సంబంధిత అధికారులతో బుధవారం చర్చించారు. మొట్టమొదటిసారిగా పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదయిందని భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పాఠశాలలలో జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను సంబంధిత అధికారులతో చర్చించడం జరిగిందని విద్యాశాఖ అధికారి కిరణ్ కుమార్ తెలిపారు.