గండీడ్: గండీడ్ మండలంపై చర్చ, తరలిరావాలని గండీడ్ మండల సాధన సమితి జేఏసీ పిలుపు
గండీడ్ మండలాన్ని వికారాబాద్ జిల్లాలో కలిపేందుకు ఈనెల 11న డీసీసీ అధ్యక్షుడు, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డిని కలిసేందుకు మండల వ్యాప్తంగా ఉన్న నేతలు, నిరుద్యోగులు పెద్ద ఎత్తున తరలి రావాలని వికారాబాద్ జిల్లా గండీడ్ మండల సాధన సమితి జేఏసీ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్ ఆదివారం పిలుపునిచ్చారు. మండల కేంద్రం నుంచి డీసీఎంలు ఏర్పాటు చేశామన్నారు. గండీడ్ మండలం ప్రస్తుతం మహబూబ్ నగర్ జిల్లాలో ఉంది.