యాడికి మండలం వెంగన్న పల్లి గ్రామంలోని జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థుల కోసం తాడిపత్రికి చెందిన రైల్వే ఉద్యోగి హనూక్ కుమార్ సోమవారం కంప్యూటర్ పరికరాలను వితరణ చేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు కృష్ణ మోహన్ రెడ్డి కి కంప్యూటర్ ప్రింటర్, సీపీయూ , కీబోర్డ్ వంటి పరికరాలను అందజేశారు. విద్యార్థులు కంప్యూటర్ పరిజ్ఞానాన్ని పెంచుకోవాలని సూచించారు. భవిష్యత్తులో కూడా పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.