జిల్లాలోని పాడి రైతులు తమ పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలని జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. బుధవారం జిల్లాలోని ఆసిఫాబాద్ మండలం అంకుశపూర్ గ్రామంలో పశు వైద్య ఉపకేంద్రంలో పశు వైద్య - ప్రస్తుత సంపర్ధక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గాలికుంటు వ్యాధి నివారణ టీకాల పంపిణీ కార్యక్రమానికి అధికారులతో కలిసి హాజరై పశువులకు టీకాలు వేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పశువుల యజమానులు తమ పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలని, ఏ ఒక్క పశువు మిగలకుండా టీకాలు వేయించాలని తెలిపారు.