మార్కాపురం: భార్య చేతులను కర్రలకు కట్టేసి భర్త విచక్షణ రహితంగా కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్
ప్రకాశం జిల్లా తర్లుపాడు మండలం కలుజువ్వలపాడు గ్రామంలోని జగనన్న కాలనీలో గత శనివారం రోజు తన భార్యను తన భర్త రెండు చేతులను కర్రలకు కట్టివేసి బెల్టుతో విచక్షణ రహితంగా కొట్టాడు. ఆమె అరుస్తుంటే వినపడకుండా నోరు మూసివేసి కాళ్లతో చేతులతో తన్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో విషయం తెలుసుకున్న తర్లుపాడు ఎస్ఐ బ్రహ్మనాయుడు సంఘటన ప్రాంతానికి చేరుకొని పరిశీలించి కేసు దర్యాప్తు చేపట్టారు.