యర్రగొండపాలెం: జస్టిస్ గవాయి మీద జరిగిన దాడికి ఎమ్మార్పీఎస్ అనుబంధ నాయకులు నిరసన
ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలో ఎమ్మార్పీఎస్ ఎంఎస్పి ఆధ్వర్యంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గవాయి మీద జరిగిన అనాగరిక దాడికి నిరసన తెలియజేశారు. ముందుగా పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద దాడికి పాల్గొన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిరసన తెలియజేశారు. నల్లజెండాలతో ఎమ్మార్వో కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన చేశారు. అనంతరం డిటి విజయభాస్కర్ కు వినతి పత్రం అందజేశారు.