భీమవరం: శ్రీ బాల త్రిపుర సుందరి దేవి దసరా మహోత్సవ పోస్టర్ ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్
భీమవరం మెంటేవారి తోటలోని శ్రీబాల త్రిపుర సుందరి దేవి దేవస్థానంలో ఈ నెల 22వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు జరగనున్న దేవి శరన్నవరాత్రి మహోత్సవ బ్రోచర్, పుస్తకాలను మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఆవిష్కరించారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు భీమవరంలోని వారి కార్యాలయంలో మాట్లాడారు. 22వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు అమ్మవారికి రోజుకొక అలంకరణ చేస్తామని ఆలయ అర్చకులు శ్రీనివాస్, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు తెలిపారు.