అడవిదేవులపల్లి: అడవిదేవులపల్లి ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
నల్లగొండ జిల్లా అడవిదేవులపల్లి ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం ద్వారా సంతృప్తికరమైన వైద్య సేవలు అందిస్తున్నందుకు గాను నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి పిహెచ్సి డాక్టర్ వైద్య సిబ్బందిని గురువారం అభినందించారు. గురువారం అడవి దేవులపల్లి ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అకస్మికంగా తనిఖీ చేశారు. ఏఎన్సీ రిజిస్టర్ , ఓపిడి రిజిస్టర్ ఈడిడి క్యాలెండర్ ఎఎన్సీ చెక్ రిజిస్టర్ అన్నిటిని పరిశీలించి రిజిస్టర్ లని ఎప్పటికప్పుడు నిర్వహిస్తుండడం పట్ల జిల్లా కలెక్టర్ సంతృప్తిని వ్యక్తం చేశారు.