మాడుగులపల్లి: గార కుంటపాలెంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించిన ఏపిఎం భాష చంద్రశేఖర్
నల్లగొండ జిల్లా మాడుగులపల్లి మండలంలోని గారకుంటపాలెంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మాడుగుల పల్లి ఏటీఎం భాష చంద్రశేఖర్ సిసి స్వాగత్ రావుతో కలిసి సోమవారం సందర్శించారు. ఏఈఓ సర్టిఫైడ్ చేసిన నేచర్ ప్రకారం ఉన్నటువంటి ధాన్యాన్ని మాత్రమే సీరియల్ ప్రకారం కాంటా వెయ్యాలన్నారు. ధాన్యానికి సంబంధించి సంబంధిత మిల్లు నుండి ట్రక్ సీడ్స్ తీసుకువచ్చి ట్యాబ్ ఎంట్రీ పూర్తి చేసి బిల్స్ పెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో వివో అధ్యక్షురాలు శివలీల వివోఏ సోమయ్య ట్యాబ్ ఆపరేటర్ మహేందర్ తదితరులు పాల్గొన్నారు.