ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి తన జీవితంలో బదిలీ, పదోన్నతి, పదవి విరమణ తప్పనిసరని గుంతకల్లు మాజీ ఎమ్మెల్యే మధుసూదన్ గుప్తా అన్నారు. అనంతపురం జిల్లా గుత్తి అర్ఎస్ రైల్వే ఇన్స్టిట్యూట్ లో ఆదివారం సీనియర్ రైల్వే ఉద్యోగి అమూరు శ్రీనివాసులు పదవి విరమణ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రైల్వే ఉద్యోగి దంపతులకు మాజీ ఎమ్మెల్యే పూలమాలలు, శాలువాతో సత్కరించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ రైల్వే ఉద్యోగి శ్రీనివాసులు నిబద్దతతో పని మంచి పేరు తెచ్చుకున్నారని అన్నారు.