తాడిపత్రి: తాడిపత్రి తన ఇంటిలో టీడీపీ కార్యకర్తలతో కలిసి ఉమెన్స్ వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ తిలకించిన ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి
తాడపత్రి లోని తన స్వగృహంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు, ప్రజా ప్రతినిధులు, క్రికెట్ అభిమానులతో కలిసి ఆదివారం ఉమెన్స్ వరల్డ్ కప్ లో ఇండియా- దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న క్రికెట్ ఫైనల్ మ్యాచ్ ను తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి తిలకించారు. ఇండియన్ బ్యాట్స్ ఉమెన్ లు సిక్స్ లు, ఫోర్లు కొడుతుంటే ఎంజాయ్ చేశారు. మొత్తం పై క్రికెట్ మ్యాచ్ ను ఎంతో ఆసక్తిగా తిలకించారు.