పత్తికొండ: పత్తికొండ ఉల్లి రైతులతో వారి కష్టాలను తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి
కర్నూలు జిల్లా పత్తికొండ మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి ఉల్లి పంట పొలాల్లో పర్యటించి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు మంగళవారం తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఉల్లి రైతులు తీవ్రంగా ధర లేకపోవడంతో నష్టపోతున్నారని మరియు కొంతమంది రైతులు పంటలను ట్రాక్టర్ తో ఎద్దులతో దున్నిస్తున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఉల్లి రైతులను ఆదుకోవాలని వైసిపి మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి తెలిపారు.