మత్స్య అలంకారంలో శ్రీమద్వెంకట రామమూర్తి స్వామి
- సూళ్లూరుపేటలో ఘనంగా పెరటాసి మాస మొదటి శనివారం పూజలు
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణంలో వెలసి ఉన్న శ్రీమధ్వెంకట రామమూర్తి స్వామి వారి ఆలయంలో పెరటాశి మాసం ఉత్సవాలను ఘనంగా ప్రారంభించారు. స్వామి వారికి శనివారం వేదపండితులు ప్రత్యేక అభిషేకాలు చేసి మత్స్య అలంకారం చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకొని పూజలు చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు వినుకొండ అనంతకుమార్ దీక్షితులు పర్యవేక్షణలో పూజలు నిర్వహిస్తున్నారు.