అనపర్తి: కైకవోలు,అనపర్తి లో పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించిన ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి
అనపర్తి నియోజకవర్గం లోని కైకవోలు లో నూతనంగా నిర్మించిన వాటర్ ట్యాంకును ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. అదేవిధంగా అనపర్తి వైసిపి కార్యాలయంలో 280 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి ఇల్లపట్టాలని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసిపి నాయకులు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.