కాప్రా డివిజన్ లోని శ్రీ సాయి శివ నగర్ లో రోడ్డు నిర్మాణ పనులను ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి శంకుస్థాపన చేశారు. సుమారు 90 లక్షలతో పనులను చేపట్టినట్లు తెలిపారు. శ్రీ సాయి శివనగర్ కాలనీ అభివృద్ధి పట్ల పూర్తి కట్టుబడి తో పనిచేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఎస్ పార్టీ కాప్రా డివిజన్ అధ్యక్షుడు బైరి నవీన్ గౌడ్, కాలనీవాసులు పాల్గొన్నారు.