ప్రకాశం జిల్లాలో ఓ మహిళ ప్రయత్నం 22 KM దూరాన్ని తగ్గిస్తోంది. టంగుటూరు, కొండపి మండలాల మధ్య ఉన్న ఏరు చూట్టు తిరిగివస్తే 40 KM. అదే ముప్పవరం వద్ద ఉన్న మూసీ కాలువ దాటితే 18 KMలలో చేరుకోవచ్చు. మార్తమ్మ అనే మహిళ ప్రయాణికులను నది దాటించేందుకు తమ బోటును ఉపయోగిస్తూ సమయాన్ని ఆదాచేస్తూ ట్రిప్‌కు రూ.20 తీసుకుంటూ ఉపాధి పొందుతోంది. అధికారులు స్పందించి కాలువ మధ్య బ్రిడ్జి నిర్మించాలని స్థానికులు కోరారు.