కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎస్సీ ఎస్టీలకు రక్షణ లేకుండా పోయింది:వైసీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు నరసింహమూర్తి
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎస్సీ ఎస్టీలకు రక్షణ లేకుండా పోయిందని శ్రీ సత్యసాయి జిల్లా వైసీపీ ఎస్సీ విభాగం అధ్యక్షులు నరసింహమూర్తి మండిపడ్డారు. సోమవారం మధ్యాహ్నం పుట్టపర్తి వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్ వెంట ఎస్సీ ఎస్టీలు నడుస్తున్నారన్న అక్కస్సుతోనే కూటమి ప్రభుత్వం వారిపై కక్ష సాధిస్తుందా అంటూ మండిపడ్డారు. సంక్షేమ పథకాలు అందకుండా చేస్తున్నారని ఎస్సీ ఎస్టీల ఎదుగుదలను ఈ ప్రభుత్వం అణచివేస్తుందన్నారు.