జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించిన ఎస్పీ సతీష్ బాబు
శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి ఎస్పీ కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం జిల్లా ఎస్పీ సతీశ్ కుమార్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించినట్లు అధికారులు తెలిపారు. ఫిర్యాదులు పునరావృతం కాకుండా విచారణ జరిపి వెంటనే బాధితులకు న్యాయం చేయాలని ఎస్పీ అధికారులను ఆదేశించారు. కుటుంబ కలహాలు, భూ తగాదాలు, వ్యాపార, సైబర్ మోసాలు, తదితర సమస్యలపై 60 ఫిర్యాదులు అందినట్లు పేర్కొన్నారు.