బెజవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్నా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
దసరా మహోత్సవాల్లో వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికారులు చూడాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. సోమవారం రాత్రి ఎన్ని గంటల సమయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి నాదెండ్ల మనోహర్ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికి అమ్మవారి దర్శనం కల్పించి అనంతరం అమ్మవారి చిత్రపటం శేష వస్త్రాలు ప్రసాదం అందజేశారు. దసరా మహోత్సవాలకి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.