వైద్య అధికారులు సిబ్బంది పల్స్ పోలియో కార్యక్రమం పట్ల నిర్లక్ష్యం వహించరాదని జిల్లా నోడల్ అధికారి జగదీష్ చంద్ర రెడ్డి పేర్కొన్నారు, గురువారం నంద్యాల జిల్లా చాగలమర్రి పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలో పల్స్ పోలియో కార్యక్రమం పై వైద్య సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు, పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ ప్రజల భాగస్వామ్యంతో విజయవంతం చేయాలని ఆయన సూచించారు, ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు సిబ్బంది పాల్గొన్నారు