జీవో నెంబర్ 17ను రద్దు చేయాలి : గూడూరు ఏఐటీయూసీ
Gudur, Tirupati | Oct 23, 2025 కార్మిక సంక్షేమ బోర్డు నిధులను దారి మళ్లించే జీవో 17ను రద్దు చేయాలని ఏఐటీయూసీ నాయకులు డిమాండ్ చేశారు. గురువారం గూడూరు కార్మిక శాఖ ఆఫీసు ఎదుట భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులతో కలిసి ధర్నా నిర్వహించారు. పెండింగ్ క్లెయిమ్స్ పూర్తి చేయాలని, పని ప్రాంతాలలో కార్మికులకు భద్రత కల్పించాలన్నారు. ఈ ధర్నాలో సీపీఎం నాయకులు శశి కుమార్, రమేష్, ఏఐటీయూసీ నాయకులు నారాయణ, ఇన్సాఫ్ జమాలుల్లా, మీరా పాల్గొన్నారు.