గుంతకల్లు: గుత్తిలోని చెంబుల బావి వీధిలో వెంకటరామిరెడ్డి అనే వ్యక్తిపై దాడి, అనంతపురం తరలింపు
గుత్తిలోని చెంబులబావి వీధిలో వెంకటరామిరెడ్డి అనే వ్యక్తి పై ఆఫ్జల్ పాటు మరో నలుగురు దాడి చేసి విచక్షణారహితంగా కొట్టారు. ఈ ఘటన మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. డబ్బులు విషయంపై గొడవ జరిగింది. ఆఫ్జల్ మరో నలుగురు వ్యక్తులు వెంకటరామిరెడ్డి పై దాడి చేశారు. దాడిలో వెంకటరామిరెడ్డి తీవ్రంగా గాయపడ్డాను. చేయి విరిగింది, తలకు బలమైన గాయమైంది. గుత్తి ఆసుపత్రి అనంతరం అనంతపురం రెఫర్ చేశారు. ఈ సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.