పట్టణ వన్ టౌన్ సీఐ గా ప్రకాష్ బాధ్యతలు చేపట్టారు
శ్రీకాళహస్తి వన్ టౌన్ సీఐగా ప్రకాశ్ బాధ్యతలు శ్రీకాళహస్తి వన్ టౌన్ సీఐగా ప్రకాశ్ కుమార్ గురువారం బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ వన్ టౌన్ సీఐగా పనిచేస్తున్న గోపిని వీఆర్కు బదీలీ చేశారు. ప్రకాశ్ మాట్లాడుతూ.. ప్రముఖ పుణ్య క్షేత్రమైన శ్రీకాళహస్తికి బదిలీ కావడం ఆనందంగా ఉందన్నారు. శాంతిభద్రత విషయంలో రాజీ లేకుండా పని చేస్తానన్నారు. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు. పోలీసులకు ప్రజలు సహకరించాలని ఆయన ఈ సందర్భంగా ఆయన కోరారు.